హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థి మృతదేహం లభ్యం..!

ASR: జిల్లా అరకులోయ సమీపంలోని చొంపి జంక్షన్ హైవే బ్రిడ్జి కింద వాగులో ఇవాళ యువతి మృతదేహం లభ్యమైంది. మృతురాలు డుంబ్రిగుడ మండలం గుంటగన్నెల గ్రామానికి చెందిన కిల్లో మీనా (20)గా గుర్తించారు. ఆమె అరకులోని ఐటీఐలో మొదటి సంవత్సరం చదువుతోంది. దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.