నంద్యాల జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బనగానపల్లె మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కూటమి నేతల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. కార్యాలయ ప్రహరీపై సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు ఉన్నప్పటికీ, వైఎస్సార్ విగ్రహానికి మాత్రం ఎన్నికల అధికారులు ముసుగు వేశారు. ఈ తీరుపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇదేం చోద్యమంటూ ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల కోడ్ అమలులో ఇదేం వివక్ష?'


