GNTR: గుంటూరు జిల్లాలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పెదనందిపాడు మండల కేంద్రంలోని సరిహద్దు చెక్‌పోస్టు వద్ద బుధవారం తనిఖీలు చేపట్టారు. సివిల్ సప్లాయ్ డీటీ శివశంకర్, పోలీసు సిబ్బంది కలిసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల్లో అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిఘా పెంచినట్లు తెలిపారు. నిబంధనలు మీరితే చర్యలు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎన్నికల వేళ పెదనందిపాడులో ముమ్మర తనిఖీలు


