హైదరాబాద్: 28°C
వార్తలు

బర్డ్‌ఫ్లూకు చెక్.. దేశీయంగా సరికొత్త వ్యాక్సిన్ రెడీ

ప్రమాదకరమైన బర్డ్‌ఫ్లూకు చెక్ పెట్టేందుకు దేశీయంగా సరికొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. H5N1 వైరస్ రకం నుంచి పూర్తి రక్షణ కల్పించేలా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్(NIHSAD) ఈ స్వదేశీ వ్యాక్సిన్‌ను విజయవంతంగా రూపొందించింది. జంతువులు, పక్షుల ఆరోగ్య భద్రతకు అత్యంత కీలకమైన ఈ వ్యాక్సిన్‌ను ఈనెల 20న భోపాల్‌లో అధికారికంగా విడుదల చేయనున్నారు.