హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ ఛైర్మన్‌గా టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌?

అన్నమయ్య: జిల్లా పరిషత్, ఎంపీపీ పీఠాల ఎంపిక వ్యవహారం కీలక దశకు చేరింది. జడ్పీ ఛైర్మన్‌గా టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. జడ్పీ ఛైర్మన్, ఎంపీపీ పదవుల కేటాయింపులో కూటమి మధ్య సమన్వయం సాధించేందుకు టీడీపీ ఇన్‌ఛార్జి దామచర్ల సత్య ఇవాళ మదనపల్లెకు రానున్నారు. చర్చల అనంతరం పదవుల కేటాయింపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.