హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బోరెడ్డిగారి పల్లెలో ప్రజా దర్బార్ కార్యక్రమం

అన్నమయ్య: చిన్నమండెం మండలం బోరెడ్డిగారి పల్లెలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను సావధానంగా విని అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు