ప్రకాశం: ఒంగోలులోని కొప్పోలు సమీపంలో బుధవారం ఉదయం 16వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీని మరో లారీ వెనకనుంచి ఢీకొట్టడంతో లారీ ముందు భాగం ధ్వంసం అయింది. ప్రమాదంలో లారీ నడుపుతున్న ఓ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
హైవేపై రోడ్డు ప్రమాదం


