TG: HYD నుంచి శంకర్పల్లి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న మొకిలా వద్ద 165.37 ఎకరాల్లో 1,293 ప్లాట్లు చేసి HMDA వేలం వేసింది. 100 ప్లాట్లను చ.గజానికి రూ.1,09,500 చెల్లించి కొనుగోలుదారులు దక్కించుకున్నారు. ఈ భూమిలోని 96/పీ సర్వే నంబర్లో కొంతభాగం 22Aలో ఉందని అధికారులు రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. కోట్లు చెల్లించి ప్లాట్లు కొంటే రిజిస్ట్రేషన్ నిలిపివేయడం ఏంటని కొనుగోలుదారులు నిలదీస్తున్నారు.
వార్తలు
రిజిస్ట్రేషన్లకు నోచుకోని HMDA భూములు!


