హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంటకు నిప్పు పెట్టిన రైతు

MNCL: దండేపల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన తిరుపతి అనే రైతు తన పొలంలో ఎండిపోయిన వరి పంటకు నిప్పు పెట్టాడు. వర్షాకాలం సీజన్‌లో ఒక ఎకరంలో వరి పంటను సాగు చేశారు. కడెం ప్రాజెక్టు, గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ల నుంచి సాగునీరు అందకపోవడంతో వరి పంట ఎండిపోయింది. దీంతో మనోవేదనకు గురైన తిరుపతి ఎండిపోయిన పంటను చూస్తూ నిప్పు పెట్టి కన్నీరు పెట్టుకుంటూ విలపించారు.