BHPL: మహాదేవపూర్‌లో కేజీబీవీ వసతిగృహానికి సరఫరా చేయాల్సిన బియ్యం పక్కదారి పట్టిన ఘటన వెలుగుచూసింది. వ్యాన్‌లో 10 క్వింటాళ్ల 50 కిలోల బియ్యం తరలిస్తుండగా, డ్రైవర్ తన ఇంటి వద్ద 4 క్వింటాళ్లు దించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఆర్‌ఐ జగన్‌రెడ్డి తనిఖీలు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలింపు తీరుపై స్థానికంగా చర్చ జరుగుతోంది.
తెలంగాణ
బియ్యం తరలింపులో అక్రమాలు.. ఆర్‌ఐ తనిఖీలు


