హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మోకింగ్ జోన్లపై కేసులు

MNCL: జన్నారం మండల కేంద్రంలో అనుమతులు లేకుండా పాన్‌షాపుల వద్ద స్మోకింగ్ జోన్లు నడుపుతున్న పొనకల్‌కు చెందిన ముగ్గురు యజమానులపై కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి గస్తీలో గుర్తించగా, SI గుర్రం ఉదయ్ కిరణ్ వివరాలు వెల్లడించారు. బహిరంగ ధూమపాన నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పొగ వల్ల పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ బాధితులకు ముప్పని పేర్కొన్నారు.