కృష్ణా: ఈ నెల 19న జరగనున్న మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికల ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ ఎంపీడీవోలను ఆదేశించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్


