హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్‌కౌంటర్‌.. లష్కరే ఉగ్రవాది లతీఫ్ హతం

జమ్మూకశ్మీర్‌ కుల్గాం ఎన్‌కౌంటర్‌లో లష్కరే ఉగ్రవాది లతీఫ్ భట్ హతమయ్యాడు. ఇటీవల కుల్గాం లారూలో గాయాలతో తప్పించుకున్న అతడిని నిన్న అర్ధరాత్రి దళాలు చుట్టుముట్టాయి. లొంగిపోవాలని అధికారులు వీడియో కాల్ చేసి సూచించినా పట్టించుకోలేదు. దీంతో బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లతీఫ్ హతమయ్యాడు. CRPF జవాన్లపై కాల్పుల తర్వాత అతడి కోసం గాలిస్తున్న దళాలు ఎట్టకేలకు మట్టుబెట్టాయి.