హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

NDL: కార్తీక మాసం రెండో బుధవారం సందర్భంగా బనగానపల్లె అయ్యప్ప స్వామి దేవస్థానంలో ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకం, అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారు దివ్య మంగళ దర్శనమిచ్చారు. మండల దీక్షలో ఉన్న స్వాములకు 60 రోజుల పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం అన్నప్రసాదం, రాత్రి అల్పాహారం అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.