హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి భేటీ

ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. ఈ కీలక భేటీకి కేంద్ర కేబినెట్ మంత్రులతో పాటు, స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు, కేంద్ర సహాయ మంత్రులు హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, వివిధ మంత్రిత్వ శాఖల పనితీరు, భవిష్యత్ కార్యాచరణ తదితర కీలక అంశాలపై ఈ సమావేశంలో మంత్రులతో ప్రధాని మోదీ చర్చించి, దిశానిర్దేశం చేయనున్నారు.