హైదరాబాద్: 28°C
వార్తలు

'ఇలా చేయొద్దు నాన్నా.. చనిపోతాం'

'నాన్నా.. మేం చనిపోతాం' అని ఆ పసికందులు వేడుకున్నా ఆ కసాయి తండ్రికి కనికరం రాలేదు. చాక్లెట్ల పేరుతో తీసుకెళ్లి 7, 5 ఏళ్ల తన ఇద్దరు కొడుకులను మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఓ కాలువలోకి తోసేశాడు. అడ్డుకోబోయిన రైతులపైకి రాళ్లు రువ్వాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సోమనాథ్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కాలువలో గల్లంతైన పిల్లల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది.