కర్నూలు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సమీకృత పశు ఆశ్రయ కేంద్రాల నిర్వహణ, పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రాల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, పెండింగ్ పనుల వివరాలను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సమీకృత పశు ఆశ్రయ కేంద్రాలపై సమీక్ష


