హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏలూరులో ట్రాఫిక్ ఆంక్షలు

ELR: ఏలూరు పట్టణంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు పలు ప్రాంతాల్లో వన్‌వే, నో ఎంట్రీ విధానాలను అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణరావు తెలిపారు. 12 పంపుల సెంటర్‌–రైల్వే గేట్ మార్గంలో నో ఎంట్రీతో పాటు.. శ్రీనివాస థియేటర్ బ్రిడ్జి, పవర్‌పేట ప్రాంతాల్లో ట్రాఫిక్ మార్గదర్శకాలు ఏర్పాటు చేసామన్నారు. వాహనదారులు సహకరించాలన్నారు.