హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ పదవికి కీలకంగా టాస్

ATP: శింగనమల ఎంపీపీ పీఠం కోసం వైసీపీ, టీడీపీ మధ్య ఉత్కంఠ నెలకొంది. మండలంలోని మొత్తం 12 ఎంపీటీసీ స్థానాల్లో ఇరు పార్టీలకు చెరో ఆరు స్థానాలు దక్కాయి. దీంతో ఎంపీపీ ఎన్నికలో టాస్ కీలకంగా మారింది. వైసీపీ అభ్యర్థిగా తిరుపాలమ్మ, టీడీపీ అభ్యర్థిగా పేట తులసి పోటీలో ఉన్నారు. గురువారం పోలీసు బందోబస్తు మధ్య ఎన్నిక జరగనుంది.