హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సూర్యలంక సముద్ర తీరంలో విషాదం.. వ్యక్తి మృతి!

బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన వ్యక్తి అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. మృతుడిని గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన షేక్ వలి (40)గా గుర్తించారు. 15 మంది బృందంతో విహారయాత్రకు వచ్చిన ఆయన లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై బాపట్ల గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.