హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలి విడతలో మొత్తం 2368 నామినేషన్లు!

తూ.గో: తొలిదశలో ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో నామినేషన్ ప్రక్రియ మంగళవారం ముగిసింది. మొత్తం సర్పంచ్ స్థానాలకు 350, వార్డు స్థానాలకు 2018 నామినేషన్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు. రాజమహేంద్రవరం గ్రామీణం, కడియం, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఈ నెల 21 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంటుంది.