హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

40 ఏళ్లు తండ్రి, కుమారుడే సర్పంచ్!

అనంతపురం: రాయదుర్గం మండలం 74.ఉడేగోళం గ్రామంలో 40 ఏళ్లుగా తండ్రి, కుమారుడే సర్పంచులుగా కొనసాగారు. 1956లో ఈ పంచాయతీ ఆవిర్భవించింది. 1996 వరకు శరణప్ప 10 ఏళ్లు, 30 ఏళ్లు తిప్పేస్వామి సర్పంచిగా ఏకగ్రీవం అయ్యారు. ఆ తర్వాత జరిగిన 6 ఎన్నికల్లో వీరు పోటీచేయనప్పటికీ వారి కుటుంబ మద్దతుతోనే అభ్యర్థులు గెలిచేవారు. ఈ గ్రామం ఉత్తమ పంచాయతీగా రెండు సార్లు ఎంపికైంది.