హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్నాడు నీటి పథకంపై బీఆర్ఎస్ ధర్నా

పల్నాడుకు నాగార్జునసాగర్ నుంచి తాగునీరు తరలించే జల్‌జీవన్ మిషన్ పనులను నిలిపివేయాలంటూ మంగళవారం విజయపురి సౌత్ వద్ద సాగర్ కొత్త వంతెనపై బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. సుమారు రూ.1,200 కోట్ల ఈ వాటర్ గ్రిడ్ తొలి దశలో పైపులైన్ల ద్వారా 235 గ్రామాలకు నీరందుతుందని, సొరంగం లేదని ఏపీ గ్రామీణ నీటి సరఫరా అధికారులు స్పష్టం చేశారు.