హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ

KRNL: జిల్లాలో రెండో విడతలో 9మండలాల్లో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు డీపీవో జి. భాస్కర్ తెలిపారు. కోసిగి, కైతాలం, మంత్రాలయం, పెద్దకడబూరు, గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు, కల్లూరు, ఓర్వకల్లు మండలాల పరిధిలోని 186 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, 1,972 వార్డు సభ్యుల స్థానాలకు ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి.