హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోనఉప్పలపాడు సర్పంచి @రూ. 36 లక్షలు!

అనంతపురం: యాడికి మండలం కోనఉప్పలపాడు పంచాయతీ సర్పంచి పదవి రూ. 36 లక్షలకు ఏకగ్రీవం అయింది. స్థానిక రాజకీయ నాయకులు కలిసి వేలంపాట నిర్వహించారు. రూ. 36 లక్షలకు బద్దెల రాముడు సర్పంచి పదవిని దక్కించుకున్నాడు. ఈ మొత్తంలో కొంత రామాలయం నిర్మాణంకు వినియోగించాలని నిర్ణయించారు. కాగా ఈ పంచాయతీ పరిధిలో కోనఉప్పలపాడుతో పాటు ఓబుళాపురం కూడా ఉంది.