ప్రకాశం: తుపాను వర్షాలతో ప్రకాశం జిల్లాలో రబీ సాగు ఊపందుకుంది. మూడు రోజుల్లో సగటున 114.8 మి.మీ. వర్షం కురిసింది. రబీలో సుమారు 1.17 లక్షల హెక్టార్లలో సాగు అంచనా వేస్తున్నారు. పొగాకు 37,776, శనగ 32,729, వరి 22,818 హెక్టార్లు. ఖరీఫ్‌లో లోటు వర్షపాతం 58.4 శాతం కావడంతో కందుకూరు, కొండపి, దర్శి మెట్ట మండలాల రైతుల్లో ఆందోళన ఉంది.
ఆంధ్రప్రదేశ్
ప్రకాశంలో రబీ సాగు మొదలు


