హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వరి కోతలు వాయుదా వేయాలి'

PPM: తుఫాను నేపథ్యంలో రెండు రోజులలో భారీ వర్షాలు కురిసి అవకాశం ఉన్నందున వరి కోతలు వాయిదా వేసుకోవాలని సాలూరు MAO శిరీష సూచించారు. మంగళవారం స్దానిక శివరాంపురం, గుమడాం గ్రామాలలో ఆమె పర్యటించారు. ఇప్పటికే కోత కోసిన పంటను జాగ్రత్తగా భద్రం చేసుకోవాలని, పొలాలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఈవో తిరుపతి రావు, సిబ్బంది మనోజ్‌ పాల్గొన్నారు.