WG: పాలకొల్లు మున్సిపల్ ఎన్నికల్లో 44 కౌన్సిలర్ స్థానాల కోసం దాఖలైన 347 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని కమిషనర్ కిరణ్ కుమార్ మీడియాకు తెలిపారు. అదేవిధంగా ఛైర్పర్సన్ పదవి కోసం దాఖలైన 27 నామినేషన్లు కూడా ఆమోదం పొందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 29 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఉపసంహరణ గడువు ముగిశాక అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
పాలకొల్లు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు సక్రమం


