SKLM: రణస్థలం మండలం వి.ఎన్.పురంలో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. చెరువులో పడి కెల్ల పుణ్యవతి (43) మృతి చెందారు. చిన్న కుమార్తె శైలజకు డిసెంబర్ 12న పెళ్లి జరగాల్సి ఉంది. మంగళవారం ఇత్తడి సామగ్రి కడిగేందుకు నీరు తేవడానికి చెరువుకు వెళ్లిన పుణ్యవతి తిరిగి రాలేదు. సాయంత్రం భర్త చూడగా విగతజీవిగా కనిపించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చెరువులో పడి మహిళ మృతి


