కాకినాడ: నగరంలోని ఓ దుకాణంలో జరిగిన చోరీకి సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 9 లక్షల నగదు, వెండి కడ్డీలతో పాటు 1.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ కిషోర్ కుమార్ వెల్లడించారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ దుర్గారావుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కాకినాడలో చోరీ.. ఇద్దరి అరెస్ట్!


