ASR: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.సత్యనారాయణ ప్రదర్శనను ప్రారంభించి, విద్యార్థులు గ్రంథాలయాలను తరచూ సందర్శించాలని, పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు చదవాలని సూచించారు. కవులు, రచయితల జీవిత చరిత్రలను చదివి స్ఫూర్తి పొందాలన్నారు. సెల్ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పుస్తక ప్రదర్శన


