హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి రెండో విడత ఎన్నికలకు నామినేషన్ స్వీకరణ: కలెక్టర్

తూ.గో: జిల్లాలో నేటి నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ పది మండలాల్లో 155 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలు, 1,806 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గోకవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం, గోపాలపురం,దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో 29న ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.