ఎన్టీఆర్: ధాన్యం రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా 155 రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ వెల్లడించారు. జిల్లాలో మొత్తం 49,389 హెక్టార్లలో వరి సాగు జరగగా, సుమారు 3.21 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ధాన్యం కొనుగోలుకు 155 రైతు సేవా కేంద్రాలు: జేసీ


