హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విభేదాలు పక్కన పెట్టాలి: శ్రీనివాసరావు

కృష్ణా: పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఐకమత్యంతో పనిచేయాలని కోడూరు మండల టీడీపీ అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం కోడూరులోని శ్రీనివాసరావు ఇంటి వద్ద మండల టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉన్న చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి అందరూ ఒకే తాటిపైకి రావాలని కోరారు. కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలన్నారు.