హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి రెండో విడత నామినేషన్లు

CTR: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రెండో విడత నామినేషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి మొదలుకానుంది. పూతలపట్టు, యాదమరి, ఐరాల, బంగారుపాళ్యం, తవణంపల్లె, పులిచెర్ల, రొంపిచెర్ల, నగరి, విజయపురం, నిండ్ర మండలాల్లో రెండో విడత ఎన్నికలు నిర్వహణకు అధికారులు సమయాత్తమయ్యారు. మొత్తం 10 మండలాల్లో 253 పంచాయతీలు, 2,282 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.