CTR: అడవి పందుల వేట కోసం గుర్తుతెలియని వ్యక్తులు అమర్చిన నాటు బాంబు పేలి ఆవు మృతిచెందిన ఘటన గుడిపాల మండలం బుచ్చన్నకండిగలో మంగళవారం వెలుగు చూసింది. మేత మేస్తున్న ఆవు ప్రమాదవశాత్తు నాటు బాంబును కొరకడంతో పేలింది. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. సుమారు రూ.85 వేల విలువైన ఆవు మృతి చెందడంతో రైతు బాబునాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆంధ్రప్రదేశ్
నాటు బాంబు పేలి ఆవు మృతి


