హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి రూ.51,116 విరాళం

కోనసీమ: పి.గన్నవరం మండలం లంకల గన్నవరం శివారు నడిగాడి గ్రామానికి చెందిన పమ్మి వెంకన్న, గొంతమ్మ కుటుంబ సభ్యులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి రూ.51,116 విరాళంగా అందజేశారు. ముంబైలో నివాసం ఉంటున్న వారి మనవలు శ్యాంసుందర్, విజయ్ కుమార్, రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు మంగళవారం అమ్మవారిని దర్శించుకొని ఆలయ కమిటీ సభ్యులకు విరాళాన్ని అందించారు.