ప్రకాశం: జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డరోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం రోడ్డు దాటుతున్న ఓ బిచ్చగాడిని సింగరాయకొండ నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుర్తు తెలియని వాహనం ఢీకొని బిచ్చగాడు మృతి


