హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక రవాణాపై కేసు నమోదు

BHPL: రేగొండ మండలంలోని కనీపర్తి గ్రామ శివారులో మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు గుర్తించారు. మంగళవారం తనిఖీలు చేస్తుండగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న కౌటం క్రిష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ డి. సుధాకర్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.