E.G: తాళ్ళపూడి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామపత్రాల స్వీకరణ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. గజ్జరం, తాళ్ళపూడి, వేగేశ్వరపురం, మలకపల్లి కేంద్రాల్లో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. మండలంలో 11 పంచాయతీలు, 134 వార్డులు ఉండగా, సర్పంచ్ పదవికి 82 మంది, వార్డు సభ్యులకు 386 మంది నామినేషన్ వేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ ప్రక్రియ


