BHPL: జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో కాటారం జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థినులు సత్తా చాటారు. స్రవంతి బృందం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రదర్శించిన నృత్యానికి మంచి గుర్తింపు లభించింది. దీంతో వారు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ విజయంపై ప్రధానోపాధ్యాయుడు సోమలింగం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థినులను అభినందించారు.
తెలంగాణ
కాటారం విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక


