SRPT: ఈనెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం కానుందని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఈరోజు తెలిపారు. డిసెంబర్ 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న కుటుంబ పోషకులు అర్హులని, వారు మరణిస్తే రూ.5 లక్షల బీమా అందుతుందని తెలిపారు. ఆధార్, రేషన్ కార్డుతో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
తెలంగాణ
19 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం


