హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎండుతున్న పంటలను పరిశీలించిన TRS నాయకులు

MDK: చిలిప్‌చేడ్, ఫైజాబాద్, జగ్గంపేట గ్రామాల్లో నీరందక ఎండిపోయిన పంటలను తెలంగాణ రక్షణ సేన ఇంఛార్జులు దండె అపర్ణ, బట్టి అజయ్ పరిశీలించారు. ఆరు నెలల కష్టంతో సాగు చేసిన పంటలు ఎండిపోవడం బాధాకరమన్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొండల్ రెడ్డి, మల్లేశం, పి.డి. ఆనందం పాల్గొన్నారు.