క్వాడ్‌ను నిర్మాణాత్మక, విశ్వసనీయ భాగస్వాముల సమూహంగా భారత్ చూస్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో సముద్ర భద్రత, సరఫరా, నూతన సాంకేతికత, విపత్తు ప్రతిస్పందన తదితర రంగాల్లో పరిష్కారాలు అందించేందుకు ఈ కూటమి కృషి చేస్తోందన్నారు. ఈ క్వాడ్ సమావేశం తదుపరి లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు సహాయపడుతుందన్న నమ్మకం తనకుందని తెలిపారు.
వార్తలు
క్వాడ్.. విశ్వసనీయ భాగస్వాముల సమూహం: మోదీ


