హైదరాబాద్: 28°C
వార్తలు

వాహనదారులకు బంపర్ ఆఫర్

పెండింగ్ చలాన్లను వదిలించుకోవాలనుకునే వాహనదారులకు చండీగఢ్ జిల్లా కోర్టు సువర్ణావకాశం కల్పించింది. రూ.500 జరిమానా ఉన్న పాత చలాన్లను కేవలం రూ.100 చెల్లించవచ్చని తెలిపింది. వీటిని ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో కూడా చెల్లించవచ్చని పేర్కొంది. ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేలాది కేసులను తగ్గించడంతో పాటు వాహనదారులకు ఆర్థిక ఊరట కలగనుంది.