హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం నిర్ణయాన్ని తప్పబట్టిన సుప్రీంకోర్టు

ఢిల్లీలోని కేంద్ర సచివాలయ గ్రంథాలయాన్ని మరో చోటుకు బదిలీ చేయలన్న కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. గ్రంథాలయ వారసత్వాన్ని కొనసాగించే విషయంలో ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికేదీ లేకుండా తక్షణ నిర్ణయం ఆధారంగా చర్యలు చేపట్టినట్టు కనిపిస్తోందని పేర్కొంది. గ్రంథాలయంలోని 8.5 లక్షల పుస్తకాలను భద్రపరిచేందుకు తగిన ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశం కేంద్రానికి లేదని తెలిపింది.