MBNR: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నట్లు జడ్చర్ల ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు. NOV 19 నుంచి గ్రామ కార్యదర్శుల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.18 -59 ఏళ్ల వయస్సు వారు అర్హులని, ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ సమర్పించాలన్నారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
అర్హులకు రూ.5 లక్షల బీమా భరోసా: ఎంపీడీవో


