హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు విద్యుత్ సరఫరాకు ఆటంకం

అనకాపల్లి: ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో నిర్వహణ పనుల కారణంగా బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ అనకాపల్లి ఈఈ రామకృష్ణ తెలిపారు. తిమ్మాపురం, కోనవానిపాలెం, సారిపల్లిపాలెం, కొరుప్రోలు, పెదగుములూరు, టీఏ రోడ్డులో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు,