కృష్ణా: పెడన టీడీపీ కార్యాలయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌ను జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీ నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. పెడన మండల గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై నాయకుల మధ్య ఆత్మీయ చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యలపై టీడీపీ నేతల ఆత్మీయ చర్చ


