BHNG: చౌటుప్పల్ మండలంలో గొర్రెల చోరీ కలకలం రేపింది. ధర్మోజిగూడెం రెవెన్యూ పరిధిలోని బొల్లిగుట్ట వద్ద ఎల్లంబావికి చెందిన నీలా కిరణ్‌కు చెందిన 10 గొర్రెలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. జీవనోపాధి కోల్పోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.
తెలంగాణ
గొర్రెల చోరీ.. రూ.1.50 లక్షల నష్టం


